ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం

AP to receive rains from November 18 due to expected low pressure in Bay of Bengal. రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో

By అంజి  Published on  14 Nov 2022 6:20 AM GMT
ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం

రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 13న ఆగ్నేయ అరేబియా సముద్రంలో కలిసిపోయింది. అలాగే ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో 18వ తేదీ నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. కాగా, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మాగుంట లేఅవుట్‌ అండర్‌ బ్రిడ్జిలోకి వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మినీ బైపాస్ నుంచి జీటీ రోడ్డులోకి వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలతో సెల్లార్‌లలోకి నీరు చేరడంతో రెండు రోజుల్లో దాదాపు ఐదు సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఉదయగిరి, కావలి, గూడూరు నియోజకవర్గాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Next Story