ఏపీలో పలు చోట్ల వర్షాలు..!
By అంజి Published on 1 Dec 2019 9:29 AM ISTవిశాఖ: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందన వాతావరణశాఖ పేర్కొంది. తమిళనాడు. శ్రీలంక తీరాలకు సమీపంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ద్రోణికి తోడుగా కోమరిన్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కడప, చిత్తూరు. నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రేపు రాయలసీమ, దక్షిణకోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే పలు చోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండా వెల్లడించింది.
Next Story