సొంత బస్సులను నడిపే స్థితిలో లేము: ఆర్టీసీ అదనపు ఏజీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 11:28 AM GMT
సొంత బస్సులను నడిపే స్థితిలో లేము: ఆర్టీసీ అదనపు ఏజీ

హైదరాబాద్‌: అద్దె బస్సుల టెండర్లను సవాల్‌ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘం హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఆర్టీసీకి బోర్డు లేకుండానే ఇన్‌ఛార్జి ఎండీ టెండర్లు పిలవటం చట్ట విరుద్దమని పిటిషనర్‌ వాదించాడు. సమ్మె విషయం తేల్చకుండా శాశ్వత ప్రాతిపదికన అద్దె బస్సులు తీసుకుంటున్నారని హైకోర్టుకు ఆర్టీసీ కార్మిక సంఘం తరఫున పిటిషనర్ వాదించారు.

అదనపు ఏజీ ఆర్టీసీ సొంత బస్సులు నడిపే స్థితిలో లేనందునే అద్దె బస్సుల కోసం టెండర్లు పిలవాల్సివచ్చిందని హైకోర్టుకు తెలిపారు. ప్రజలకు తగిన ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ధర్మాసనం చెప్పిందని అదనపు ఏజీ ప్రస్తావించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే అద్దె బస్సులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితిలో అద్దె బస్సుల కోసం ఆర్టీసీని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉందని అదనపు ఏజీ వాదించారు. ఇప్పటికే ధర్మాసనం వద్ద పెండింగ్‌లో ఉన్న పిల్‌తో ఈ పిటిషన్​ను జతపరచాలని సింగిల్‌ జడ్జి ఆదేశించారు.

Next Story
Share it