దసరాకు పుట్టింటికి వెళ్తుండగా ప్రమాదం, తండ్రీకూతురు మృతి
పండగపూట వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 1:42 PM ISTదసరాకు పుట్టింటికి వెళ్తుండగా ప్రమాదం, తండ్రీకూతురు మృతి
పండగపూట వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. దసరా పండగ కోసమని కూతురు, అల్లుడిని తీసుకొస్తుండగా రోడ్డుప్రమాదం జరిగింది. దాంతో.. అత్తారింటికి నుంచి కూతురు, అల్లుడిని తీసుకెళ్తున్న క్రమంలో కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న తీవ్ర గాయాలతో అల్లుడు ప్రాణాలతో బయటపడగా.. తండ్రీ కూతురు ప్రాణాలు కోల్పోయారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలి మొపిరాలకు చెందిన వెంకన్నకు కూతురు ఉంది. పేరు అనూష. ఆమెకు వివాహం కూడా అయ్యింది. భర్త రాజేశ్‌తో కలిసి అనూష హైదరాబాద్‌లో ఉంటోంది. దసరా పండుగ సందర్భంగా కూతురిని పుట్టింటికి తీసుకొచ్చేందుకు తండ్రి వెంకన్న హైదరాబాద్‌కు వెళ్లాడు. అనుకున్నట్లుగానే కూతురు, అల్లుడిని తీసుకుని బైక్‌పై రాత్రి సమయంలో బైక్‌పై ఇంటికి బయల్దేరారు. ఆ క్రమంలోనే కిష్టాపురం సమీపానికి రాగానే మృత్యువు వారిని కబళించింది. వేగంగా వచ్చిన ఒక కారులు బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వెంకన్న, అనూష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అల్లుడు రాజేశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డుప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు స్పందించారు. తీవ్రంగా గాయపడ్డ రాజేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన తండ్రీకూతురు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేశామని.. కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పండగపూట కూతురిని పుట్టింటికి తీసుకొస్తున్న క్రమంలో రోడ్డుప్రమాదం జరిగి తండ్రీ కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.