వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు వరంగల్‌లో అత్యధిక ఫుట్‌పాల్
Vande Bharat records highest footfall in Warangal, says SCR. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు
By అంజి Published on 19 Feb 2023 4:16 AM GMTసికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకు వరంగల్ నుంచి అత్యధిక ఫుట్‌పాల్ వస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే శనివారం తెలిపింది. ''వరంగల్ స్టేషన్ నుండి రోజుకు సగటున 101 మంది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. మరో 133 మంది ప్రయాణికులు వరంగల్ స్టేషన్‌లో ప్రతిరోజూ రైలు దిగారు'' అని ఎస్‌సీఆర్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. గత నెల రోజుల్లో సికింద్రాబాద్ నుంచి వరంగల్ స్టేషన్‌కు 2,046 మంది ప్రయాణికులు, వరంగల్ నుంచి సికింద్రాబాద్‌కు 704 మంది ప్రయాణికులు ప్రయాణించారు.
విశాఖపట్నం నుంచి వరంగల్‌కు 1,806 మంది, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లకు 2,211 మంది ప్రయాణించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ జనవరి 15 న ప్రవేశపెట్టబడింది. ఇది సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడుస్తుంది. రైలు నాలుగు ఇంటర్మీడియట్ స్టేషన్లలో ఆగుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రిలో ట్రైన్ ఆగుతుంది. ఈ సర్వీస్ ప్రారంభించిన నెల రోజుల్లోనే దీనికి ప్రజల నుంచి భారీ స్పందన లభించిందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
త్వరలోనే సికింద్రాబాద్ - తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలును ప్రవేశపెట్టడానికి రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణాద్రి నడుస్తున్న మార్గంలోనే వందేభారత్ నడపాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ - బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, నెల్లూరు, గూడూరు, కాళహస్తి మీదుగా తిరుపతికి వందేభారత్ రైలను నడపాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.