వరంగల్, హన్మకొండ, కాజీపేట.. ట్రై-సిటీ ప్రజలకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

TSRTC Says Good News For Passengers. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.. తెలంగాణ ఆర్టీసీకి మహర్దశ తీసుకుని రావడానికి చాలా ప్రయత్నాలు

By Medi Samrat  Published on  8 Feb 2022 3:44 PM IST
వరంగల్, హన్మకొండ, కాజీపేట.. ట్రై-సిటీ ప్రజలకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.. తెలంగాణ ఆర్టీసీకి మహర్దశ తీసుకుని రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణించడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూనే.. ఆర్టీసీలో ప్రయాణంతో ఎంతో డబ్బులు ఆదా కూడా అవుతుందని చెబుతూ ఉన్నారు. ఇప్పటికే పలు రకాల ట్రావెల్ కార్డులను ప్రవేశ పెట్టారు సజ్జనార్. ఇప్పుడు వరంగల్, హన్మకొండ, కాజీపేట.. ట్రై-సిటీ ప్రజలకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట.. ట్రై-సిటీ ప్రజలకు T24 టికెట్ కేవలం 50 రూపాయలకే అందుబాటులో ఉంటుందని.. దీంతో తో సిటీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులలో ఒక రోజంతా హాయిగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ అవకాశం ఈ రోజే ప్రారంభిస్తున్నామని తెలిపారు సజ్జనార్. అందుకు సంబంధించి ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.

"వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై-సిటీ ప్రజలకు శుభవార్త, T24 Ticket కేవలం ₹ 50 తో సిటీ, మెట్రో ఎక్స్ప్రెస్ & ఆర్డినరీ బస్సులలో ఒక రోజంతా హాయిగా ప్రయాణించండి. ఈ అవకాశం ఈ రోజే ప్రారంభిస్తున్నాము. #TSRTCT24" అంటూ పోస్టు పెట్టారు.

అంతకు ముందు.. మేడారం జాతర కోసం ప్ర‌త్యేకంగా 51 ప్రాంతాల నుంచి 3,845 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.. భక్తులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ఇబ్బందుల‌కు గురికాకుండా బ‌స్సు స‌ర్వీసుల‌ను ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. మేడారం జాత‌ర సంద‌ర్భంగా 30 మంది భక్తులు ఒకేచోట ఉంటే.. వారి చెంతకే ఆర్టీసీ బ‌స్సు వ‌స్తుంద‌ని వెల్ల‌డించారు.. అలాంటి వారు 040–30102829 నంబర్‌కు ఫోన్ చేసి.. స‌మాచారం ఇస్తే.. బ‌స్సు మీరు ఉన్న‌చోటుకే పంపిస్తామ‌ని తెలిపారు.


Next Story