మద్యం బాటిళ్లు ,కోళ్లు పంచిపెట్టిన టీఆర్ఎస్‌ నేత.. వీడియో వైర‌ల్‌

TRS leader distributes liquor bottles and chicken to locals in warangal.సీఎం కేసీఆర్ ప్ర‌ధాని కావాలంటూ వ‌రంగ‌ల్ చౌర‌స్తా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Oct 2022 11:18 AM GMT
మద్యం బాటిళ్లు ,కోళ్లు పంచిపెట్టిన టీఆర్ఎస్‌ నేత.. వీడియో వైర‌ల్‌

తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్‌) అధ్య‌క్షుడు, సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి అడుగుపెడుతుండ‌డంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూత‌న ఉత్సాహం క‌నిపిస్తోంది. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా రేపు(బుధ‌వారం) మ‌ధ్యాహ్నాం జాతీయ పార్టీ పేరును వెల్ల‌డించ‌నున్న‌ట్లు కేసీఆర్ ఇప్ప‌టికే తెలియ‌జేశారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌కు మ‌ద్ద‌తు ఇస్తూ ప్ర‌తి జిల్లా, ప‌ట్ట‌ణంలో ఆ పార్టీ నేత‌లు ప‌లు కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. అయితే.. వ‌రంగ‌ల్ కు చెందిన ఓ స్థానిక నేత చేసిన కార్య‌క్ర‌మం ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డ‌మే కాకుండా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సీఎం కేసీఆర్ ప్ర‌ధాని కావాలంటూ వ‌రంగ‌ల్ చౌర‌స్తాలో స్థానిక టీఆర్ఎస్ నేత రాజ‌నాల శ్రీహ‌రి హ‌మాలీల‌కు మ‌ద్యం బాటిళ్ల‌తో పాటు కోళ్ల‌ను ఉచితంగా పంపిణీ చేశారు. కేసీఆర్‌, కేటీఆర్ క‌టౌట్స్‌తో రోడ్డుపై బ‌హిరంగంగానే ఇలా మందు పంపిణీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సుమారు 200 మంది కార్మికుల‌కు లిక్క‌ర్‌, కోళ్ల‌ను పంపిణీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఎంత అధికార పార్టీకి చెందిన నాయ‌కునా ఇలా మ‌ద్యం, కోళ్ల‌ను పంచిపెట్ట‌డం స‌రికాద‌ని విప‌క్షాల‌తో పాటు ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దీనిపై స్పందిస్తూ.. కేసీఆర్ ని ప్రధాన మంత్రిని చేయడానికి టీఆర్ఎస్ నేతలు మద్యం, కోళ్లను పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 'ఇది మీ ఐడియానేనా కేటీఆర్ గారూ?' అంటూ నిలదీశారు.

Next Story
Share it