వనజీవి రామయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కోటి మొక్కలు నాటి వనజీవినే, తన ఇంటి పేరుగా మార్చుకున్న గొప్ప పర్యావరణ హితుడు రామయ్య అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వనజీవి మరణం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి లోటని భట్టి అన్నారు.
పద్మశ్రీని వనజీవి రామయ్య మరణం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వనజీవి మరణం బాధకరమని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఆయన చూపించిన మార్గం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.