Warangal: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్-మామునూరు రహదారిపై ఆదివారం ఆటోరిక్షాను లారీ ఢీకొనడంతో చిన్నారి సహా ఏడుగురు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

By అంజి
Published on : 26 Jan 2025 2:13 PM IST

Seven people killed, road accident , Warangal

Warangal: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్-మామునూరు రహదారిపై ఆదివారం ఆటోరిక్షాను లారీ ఢీకొనడంతో చిన్నారి సహా ఏడుగురు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఉదయం 11 గంటలకు జరిగింది. రైల్వే ట్రాక్‌లు వేయడానికి ఉపయోగించే ఇనుప కడ్డీలతో కూడిన లారీ, రోడ్డుపై ఉన్న భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో రెండు ఆటోరిక్షాలను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించింది. లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా, ఇనుప కడ్డీలు ఆటోరిక్షాలపై పడడంతో నలుగురు మహిళలు, ఒక చిన్నారి సహా ఏడుగురు అక్కడికక్కడే మరణించారని నివేదికలు తెలిపాయి.

లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. పోలీసులు క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాదంతో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డుకిరువైపులా 1 కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై పడ్డ ఐరన్ రాడ్డులను పోలీస్ యంత్రాంగం తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

Next Story