వరంగల్‌లోని కేఎంసీ (కాకతీయ మెడికల్‌ కాలేజీ)లో మరోసారి ర్యాగింగ్‌ కలకలం రేపుతోంది. తమను కాపాడాలంటూ ఓ విద్యార్థి ప్రముఖులకు ట్విటర్‌ వేదికగా ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మెడికల్‌ కాలేజీకి వెళ్లి విచారణ చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2 రోజుల క్రితం థర్డ్‌ ఇయర్‌ విద్యార్థులు ఫ్రెషర్స్‌ డే పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఫోర్త్‌ ఇయర్‌ విద్యార్థులను ఆహ్వానించారు. ఫ్రెషర్స్‌ డే వేడుకలో సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. థర్డ్‌ ఇయర్ విద్యార్థులు తమను గౌరవించడం లేదని, మర్యాద ఇవ్వడం లేదని, దీంతో సీనియర్లు ఆగ్రహించారని తెలుస్తోంది.

ఈ ఘటనపై ఆదివారం నాడు ఓ విద్యార్థి ట్వీటర్‌ వేదికగా ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, మంత్రి కేటీఆర్‌, తెలంగాణ డీజీపీ, వరంగల్‌ సీపీతో పాటు మరో 8 మందికి ట్యాగ్‌ చేస్తూ పలు ఆరోపణలు చేశాడు. కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌ ఘటనలు జరుగుతున్నాయి.. దయచేసి కాపాడాలని, వారంతా తప్ప తాగి జూనియర్ల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని, దయచేసి కాపాడాలని కోరాడు. కాగా ఈ ఘటనపై స్పందించిన వరంగల్‌ సీపీ వెంటనే విచారణకు ఆదేశించాడు. మట్టెవాడ పోలీసులు కేఎంసీలో విచారణ చేపట్టారు. న్యూమెన్స్‌ హాస్టల్‌లో ఏం జరుగుతోందన్న దాని.. ట్విటర్‌లో విద్యార్థి చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story