రెండు రోజుల క్రితం గాంధీ ఆసుప‌త్రిని పరిశీలించిన సీఎం కేసీఆర్.. నేడు వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించనున్నారు. ప్ర‌త్యేక విమానం ద్వారా సీఎం కేసీఆర్.. ఉదయం 11 గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్‌ కాలేజీకి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్తారు. కాకతీయ మెడికల్‌ కాలేజీని ఆనుకొని ఉన్న జైలును ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన తీసుకున్న‌ నేఫ‌థ్యంలో 11.45 గంటలకు వరంగల్‌ సెంట్రల్‌ జైలును సందర్శిస్తారు.

అనంతరం అక్కడి నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకొని భోజనం చేయనున్నారు. ఆ తర్వాత 2 గంటలకు ఎంజీఎం ఆసుప‌త్రికి వెళ‌తారు. అక్క‌డ కరోనా బారినపడి చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి, వారికి భరోసా కల్పించారు. అలాగే ఆసుప‌త్రిలోని మౌలిక వసతులను పరిశీలిస్తారు. అనంత‌రం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తారు. అనంత‌రం సాయంత్రం 4గంట‌ల‌కు హైదరాబాద్‌కు తిరుగుప‌య‌న‌మ‌వుతారు.


సామ్రాట్

Next Story