తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పర్యటించి అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. పంట నష్టపోయిన రైతులతో కూడా సీఎం మాట్లాడనున్నారు. పంటనష్టం తీవ్రంగా ఉన్న పరకాల, నర్సంపేట గ్రామాల్లో ఆయన పర్యటించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి వెంట రేపు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఇతర అధికారులు వరంగల్‌కు వెళ్లనున్నారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రేపు వరంగల్ జిల్లాల్లో పర్యటించి అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఉత్పత్తి అయిన వరిధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో, రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితి అదుపులో ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రివర్గానికి నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.