భద్రకాళి ఆలయం తెరిచే ఉంటుంది : ఈఓ

Bhadrakali temple will remain open. చారిత్రక భద్రకాళి ఆలయం తెరిచి ఉంటుందని కార్యనిర్వహణాధికారి కె.శేషు భారతి

By Medi Samrat  Published on  23 Jan 2022 9:45 AM IST
భద్రకాళి ఆలయం తెరిచే ఉంటుంది : ఈఓ

చారిత్రక భద్రకాళి ఆలయం తెరిచి ఉంటుందని కార్యనిర్వహణాధికారి కె.శేషు భారతి, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క‌రోనా వైర‌స్ దృష్ట్యా ఆల‌యాన్ని మూసివేస్తామ‌న్న వార్త‌ల‌ను తోసిపుచ్చిన వారు.. ఆ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అంద‌లేద‌న్నారు. కొంతమంది ఉద్యోగులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని.. వారు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని.. అందువల్ల భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈఓ తెలిపారు. ఆలయంలో ఆచార వ్యవహారాలు యథావిధిగా కొనసాగుతాయని.. భక్తులు కోవిడ్-19 ప్రోటోకాల్‌ను తప్పకుండా పాటించాలని ఈఓ విజ్ఞప్తి చేశారు.


Next Story