వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఐపీఎస్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్ ను నియమిస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగనాథ్ ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన నల్గొండ ఎస్పీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మంచి పోలీస్ అధికారిగా రంగనాథ్ కు పేరుంది. ఆయన రాకపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.