వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్ర వాహనానికి ఢీకొని ముగ్గురు మృతి చెందారు. గీసుకొండ మండలం గంగదేవిపల్లి సమీపంలో చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్రమాదం మృతుల కుటుంబాల్లో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగదేవిపల్లి గ్రామానికి చెందిన ఇట్ల జగదీష్‌ (19), న్యాల నవీన్‌ (20), జనగామ జిల్లా నర్మెట్ల మండలం మాన్‌సింగ్‌ తండాకు చెందిన లకావత్‌ గణేష్‌ (21) ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై వరంగల్‌ నుంచి గంగదేవిపల్లికి వెళ్తున్నారు.

దీంతో ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఒకే సారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.