అర్థరాత్రి రాజేంద్రనగర్‌లో.. హిజ్రాల అసభ్యకర పనులు
By అంజిPublished on : 11 March 2020 9:36 AM IST

హైదరాబాద్: రాజేంద్‌రనగర్‌లోని మెట్రో పిల్లర్ నెంబర్ 162 వద్ద మంగళవారం అర్థరాత్రి హిజ్రాలు హల్‌చల్ చేశారు. విటులను ఆకర్షిస్తూ బహిరంగంగా అసభ్యకర చేష్టలకు పాల్పడ్డారు. అయితే ఈ తతంగాన్ని చూస్తున్న స్థానికులు వారిని పట్టుకొని నిలదీశారు. హిజ్రాల అసభ్యకర ప్రవర్తనతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హిజ్రాలను పట్టుకొని స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.
గత కొన్ని రోజులుగా అత్తాపూర్ సర్కిల్‌లో ఆర్డీవో ఆఫీస్ పక్కన గల ప్రదేశం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఈ ప్రదేశంలోనే గత రెండు రోజుల క్రితం ఓ మహిళను అత్యచారాం చేసి హత్య చేశారు. అర్థరాత్రి 12 గంటలకు అటువైపుగా వెళ్లే వారిని హిజ్రాలు నానా ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు తెలిపారు. కాగా స్థానిక యువకులు అందరూ కలిసి హిజ్రాలను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Next Story