వ‌ర్షానికి ఆగిన వైజాగ్ టెస్ట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2019 11:20 AM GMT
వ‌ర్షానికి ఆగిన వైజాగ్ టెస్ట్

భారత్, దక్షిణాఫ్రికాల మధ్య తొలి టెస్టు వర్షం వల్ల ముందే ఆగిపోయింది. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ 84 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత జట్టు.. బ్యాటింగ్ ఎంచుకుంది.

Image result for Rohit Test

ఓపెనర్లు రోహిత్, మయాంక్.. ఇద్దరూ ఆచితూచి ఆడారు. అందివచ్చిన బంతినల్లా బౌండరీ వైపు తరలిస్తూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేసారు. ఆట ఆగే సమయానికి భారత్ ఏ వికెట్ కోల్పోకుండా 202 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 115 పరుగులు చేయగా మయాంక్ 84 పరుగులతో ఉన్నారు. టీ తరువాత ఆట కొనసాగించవచ్చని అందరూ అనుకున్నా ఎడతెరిపి లేకుండా వర్షం పడడమే కాకుండా, వర్షం ఆగినా సరైన వెలుతురు లేని కారణంగా ఆడడం కష్టం అయింది. అందుకని ఇవాల్టికి ఆట అపేశారు.

Next Story
Share it