ముగ్గురిని అరెస్ట్ చేసి - 130 కేసులు పరిష్కరించారు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sep 2019 8:26 AM GMT
ముగ్గురిని అరెస్ట్ చేసి - 130 కేసులు పరిష్కరించారు..!

వైజాగ్: గురువారం నాడు వైజాగ్ పోలీసులు ద్విచక్ర వాహనాల చోరి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసారు. అయితే, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 130 చోరీ కేసులు వీరి అరెస్ట్ తో పరిష్కారం అయ్యాయి. ఈ దొంగలు వైజాగ్ లోనే కాకుండా.. గ్రామాల్లో కూడా బైకుల చోరీలకు పాల్పడ్డారు. ఒకసారి చోరి చేసిన తరువాత, ఎంతో తక్కువ ధర కి వాటిని అమ్మేసేవారు.

అరెస్ట్ అయిన వారు వైజాగ్ లోని పరవాడ కు చెందిన వీ. వీరయ్య చౌదరి (37), ఆర్. నాగేశ్వర రావు (32), డీ. బాబీ (37) గా గుర్తించారు. ఈ గ్యాంగ్ కు చెందిన మిగితావారి కోసం పోలిసులు ఇంకా గాలిస్తున్నారు. వీరి దగ్గర నుంచి 130 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బైకుల విడి భాగాలు, 90 వేల రూపాయల నగదు, కొన్ని దస్తావేజులు కూడా పోలీసులకు లభించాయి.

విశాఖపట్నం పోలీసు కమిషనర్ ఆర్ కే మీనా మాట్లాడుతూ..విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, గాజువాక ప్రాంతల్లో వరుస బైక్ చోరీ కేసులు నమోదు అవుతుండడంతో స్పెషల్ ఫోర్స్ ని వినియోగించి ఈ గ్యాంగ్ ను పట్టుకున్నామని తెలియజేసారు.

2013 నుంచి ఈ ముగ్గురూ మాస్టర్-కీలను వాడి బైకులను దొంగిలిస్తున్నారని.. వైజాగ్ లోనే కాకుండా, హైదరాబాద్, రాజమండ్రి ఇంకా ఇతర ప్రదేశాల నుంచి వీరు ఇంకో 120 బైకులు చోరి చేసినట్టు తెలుస్తోంది.

Next Story