విశాఖలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ ఆర్ వెంటాపురంలో ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు సంభవించింది. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు పరిశ్రమ నుంచి విష వాయులు లీక్ కావడంతో పది మంది మృతి చెందారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉండగా, ఇద్దరు రసాయన గాలి పీల్చడం వల్ల కళ్లు కనిపించక రోడ్డుపక్కనున్న కాలువలో పడి మృతి చెందారు. వాయువు దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లీకైన రసాయన గాలి పీల్చడం దాదాపు 200మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు భావిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు