100మంది విద్యార్ధుల‌ను బంధించిన వైజాగ్ డిఫెన్స్ అకాడ‌మీ యాజ‌మాన్యం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Feb 2020 7:35 PM IST
100మంది విద్యార్ధుల‌ను బంధించిన వైజాగ్ డిఫెన్స్ అకాడ‌మీ యాజ‌మాన్యం

వైజాగ్ డిఫెన్స్ అకాడ‌మీలో దారుణం చోటుచేసుకుంది. ప్లే గ్రౌండ్, హార్స్ రైడింగ్, సరైన భోజన వసతులు లేవని ఆందోళన చేస్తున్న 100మంది విద్యార్ధుల‌ను కాలేజ్ నిర్వాహకులు సెల్లార్లో బంధించారు. స‌మాచారం అందుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు హుటాహుటిన అకాడ‌మీ వ‌ద్ద‌కు చేరుకున్నారు. దీంతో విధ్యార్ధులు త‌మ గోడును పోలీసుల‌కు చెప్పుకున్నారు. కాలేజీ యాజ‌మాన్య తీరును ఎండ‌గ‌ట్టారు.

ఎటువంటి వ‌స‌తులు క‌ల్పించ‌కుండా.. ఇదేంట‌ని అడిగితే.. రూ. 1000 లు ఫైన్ వేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని విద్యార్ధులు వాపోయారు. ఈ కాలేజీ విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌కు చెందిన‌ది కావ‌డంతో సిబ్బంది ఆగ‌డాల‌కు అంతూపంతూ లేకుండా పోతుంద‌ని విద్యార్ధులు అంటున్నారు. ఈ విష‌య‌మై త‌మ‌కు త‌క్ష‌ణ‌మే న్యాయం చేయాల‌ని విద్యార్ధులు కోరుతున్నారు.

Next Story