తమిళ హీరో విష్ణు విశాల్‌తో గుత్తాజ్వాల ఎంగేజ్‌మెంట్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Sep 2020 8:46 AM GMT
తమిళ హీరో విష్ణు విశాల్‌తో గుత్తాజ్వాల ఎంగేజ్‌మెంట్‌

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తాజ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌ లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ తమ మధ్య ఉన్న ప్రేమను పలు సందర్భాల్లో వ్యక్త పరిచారు. లాక్‌డౌన్‌ కాలంలో ఒకరిని ఒకరు మిస్‌ అవుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇటీవల విష్ణు పుట్టిన రోజు సందర్భంగా జ్వాల.. సర్ ప్రైజ్ ట్రీట్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా వీరిద్దరు తమ బంధంలో మరో అడుగు ముందుకేశారు. జ్వాలా పుట్టిన రోజు సందర్భంగా.. ఇద్దరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలను ఇద్దరు వారి వారి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

”హ్యాపీ బర్త్‌డే గుత్తా జ్వాల. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మంచి భవిష్యత్‌‌ కోసం, ఆర్యన్‌ కోసం‌, మన కుటుంబాల కోసం, మన స్నేహితుల కోసం పాజిటివ్‌గా ఉందా. మీ అందరి ఆశీస్సులు కావాలి. అర్ధరాత్రి ఉంగరాన్ని అరేంజ్ చేసిన బసంత్ జైన్‌కి థ్యాంక్యు” అంటూ కామెంట్ పెట్టారు. గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన చేతన్ ఆనంద్‌ని 2005లో వివాహం చేసుకుంది. మనస్పర్ధల కారణంగా 2011లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక విష్ణు విశాల్ కూడా 2010లో రజనీ నటరాజ్‌ని పెళ్లిచేసుకోగా.. 2018లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఆర్యన్ అనే కుమారుడు ఉండగా.. ప్రస్తుతం అతడు విశాల్ సంరక్షణలో ఉన్నారు.

భారత బ్యాట్మింటన్ డబుల్స్ రంగంలో అనేక విజయాలు సాధించిన గుత్తాజ్వాల ప్రస్తుతం కోచింగ్ రంగంలో అడుగు పెట్టగా.. విశాల్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్‌గా మారాయి.Next Story