క్షమాపణలు చెప్పిన టెన్నిస్‌ స్టార్‌.. అయినప్పటికి టోర్నీ నుంచి వైదొలగక తప్పలేదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Sep 2020 7:07 AM GMT
క్షమాపణలు చెప్పిన టెన్నిస్‌ స్టార్‌.. అయినప్పటికి టోర్నీ నుంచి వైదొలగక తప్పలేదు

తన కోపమే తన శత్రువని పెద్దలు ఎప్పుడో చెప్పారు. తన ప్రస్టేషన్‌ కారణంగా వరల్డ్‌ నంబర్‌ వన్‌, సెర్బియా స్టార్‌ ఆటగాడు నొవాన్‌ జొకొవిచ్‌ యూఎస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్ని నుంచి డిస్‌ క్వాలిపై అయ్యాడు. దీంతో వరుస విజయాలకు బ్రేక్‌ పడింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం పురుషుల సింగల్స్‌ లో భాగాంగా జొకొవిచ్‌, పాబ్లో కార్రెనో బుస్టా మధ్య ప్రిక్వార్టర్‌ ఫైనల్ మ్యాచ్‌ జరిగింది. ప్రారంభ సెట్‌లో 5-6తో ప్రత్యర్థి ముందుకు వెళ్లడంతో.. జకోవిచ్‌ ఒకింత అసహనానికి గురైయ్యాడు. జకోవిచ్‌ అనుకోకుండా వెనక్కి విసిరిన బంతి అక్కడే ఉన్న లైన్‌ అంపైర్‌కు బలంగా తగలడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలారు. గొంతు సమీపంలో బంతి తగిలింది. దీంతో ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన జకొవిచ్‌ వెంటనే ఆమె వద్దకు నడిచాడు. ఆమెకేమైందో అడిగి తెలుసుకుని, తన తప్పుకు క్షమాపణ చెప్పాడు.

టోర్నీ రెఫరీ సోరెన్‌ ఫ్రిమెల్‌, గ్రాండ్‌ స్లామ్‌ సూపర్‌వైజర్‌ ఆండ్రియాస్‌ ఎగ్లీ.. జకోవిచ్‌తో 10 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం జకోవిచ్‌ మ్యాచ్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఫ్రీమెల్‌ ప్రకటించారు. అయితే ఉద్ధేశ్యపూర్వకంగా ఆమెను కొట్టకపోయినా.. లైన్‌ జడ్జ్‌ను గాయపరిచినందుకు గానూ గేమ్‌ రూల్స్‌ ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై యూఎస్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ సంబంధించింది. నిబంధనల ప్రకారమే ప్రీమెల్‌.. జకోవిచ్‌ను టోర్నీ నుంచి బహిష్కరించారని ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇప్పటి వరకు టోర్నీలో జకోవిచ్‌ సాధించిన ర్యాంకింగ్‌ పాయింట్లతో పాటు 2,50,000 నగదు మొత్తాన్ని కూడా కోల్పోనున్నాడు.

మ్యాచ్ అనంతర విలేకరుల సమావేశానికి జొకోవిచ్‌ హాజరు కాలేదు. జరిగిన ఘటనపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు. మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. తన వల్ల ఆమెకు ఇబ్బంది కలిగించినందుకు చాలా చింతిస్తున్నానని పేర్కొన్నాడు. ఆమెకు ఏమీ కానందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు. యూఎస్‌ ఓపెన్‌లో తన ప్రవర్తన పట్ల ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపాడు. టోర్నీ నుంచి నిరాశతో వెనుదిరిగినా.. ఈ ఘటనను జీవిత పాఠంగా మార్చాలనుకుంటున్నానని పోస్ట్‌ చేశాడు. తనకు వెన్నుదన్నుగా నిలిచిన కుటుంబ సభ్యులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Next Story