సముద్రంలో కలిసిపోయే నీటిని వాడుకుంటుంటే అడ్డుకోవడం కేసీఆర్ రాజకీయ దిగజారుడుకు నిదర్శనమ‌ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షులు విష్ణువర్ధన్ రెడ్డి విమ‌ర్శించారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాంత ప్రజలకు కనీసం సాగునీరు, తాగునీరు రాకుండా కుట్రచేస్తున్నార‌ని ఆరోపించారు. గోదావరి జలాల విషయంలో కేసీఆర్ మోసపూరిత వైఖరి నేడు స్పష్టంగా బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.

ఆంధ్ర ముఖ్య‌మంత్రి రాయ‌ల‌సీయ ప్ర‌జ‌ల త‌రుపున పోతిరెడ్డి పాడు విషయంలో ముంద‌డుగు వేయాల‌న్నారు. ఈ విషయంలో రాజకీయాలకతీతంగా జగన్‌మోహ‌న్ రెడ్డికి అన్ని పార్టీలు అండ‌గా నిల‌వాల‌ని ఇత‌ర పార్టీల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు చెప్పారు. కేసీఆర్ మరోసారి రాయలసీమ ద్రోహిగా మారిపోయారని, రాయసీమకు అన్యాయం చేయబోతున్న కేసీఆర్ ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని బిజెపి చెప్పదలుచుకుంద‌ని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కేసీఆర్‌కి (అనంతపురం జిల్లా ఇన్‌చార్జి గా ) రాయలసీమలో కరువు గురించి తెలియదా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్‌ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల కోసం కాదని, రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంద‌న్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *