కారు ధ్వంసం దాకా.. విశాల్-రమ్య వివాదం మరింత ముదిరిపోతోంది..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 July 2020 7:19 AM GMT
కారు ధ్వంసం దాకా.. విశాల్-రమ్య వివాదం మరింత ముదిరిపోతోంది..!

విశాల్ సంస్థలో పని చేస్తున్న ఓ మహిళ పెద్ద మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆరు సంవత్సరాలలో రమ్య అనే మహిళ 45లక్షల రూపాయలు కాజేసిందని విరుగంబాకమ్ పోలీసు స్టేషన్లో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ మేనేజర్ హరి ఇటీవలే ఫిర్యాదు చేశాడు. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు డబ్బులు కట్టకుండా తన సొంత అకౌంట్ కు డబ్బులను బదిలీ చేసుకుందని.. ఆ డబ్బులతో ఈ మధ్యనే రమ్య ఇల్లు కొనిందంటూ మేనేజర్ ఆరోపించాడు. ఆ తర్వాత రమ్య కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. విశాల్ హీరో కాదని.. పెద్ద విలన్ అంటూ ఆమె వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు విశాల్ మేనేజర్ హరి కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం సంచలనమైంది.

విశాల్ మేనేజర్ హరి కారు ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై హరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడంబాక్కం పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. తనకు రమ్యపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొద్ది రోజుల కిందట విశాల్ అతని మేనేజర్ హరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని రమ్య ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. విశాల్, హరి పలు అక్రమాలకు పాల్పడ్డారని.. వారి బండారం బయటపెడతానని హెచ్చరించింది. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడం మరో వివాదానికి దారి తీసింది.

కొద్దిరోజుల కిందట ఓ వెబ్ సైట్ తో మాట్లాడిన రమ్య తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించింది. విశాల్ కంపెనీ డబ్బులను తన అకౌంట్ కు, తన కుటుంబ సభ్యుల అకౌంట్ కు తరలించానని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం గురించి విశాల్ తనను పర్సనల్ గా అడిగి ఉండి ఉంటే.. తప్పకుండా క్లారిటీ ఇచ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది. విశాల్ అర్ధరాత్రి 12 గంటల సమయంలో కూడా ఫండ్ డబ్బులు కావాలని అడిగేవాడు.. అప్పుడు తాను వేరే అకౌంట్స్ నుండి పంపించేదాన్ని అని తెలిపింది రమ్య.

కంపెనీ అకౌంట్ కు నెట్ బ్యాంకింగ్ వంటివి లేకపోయినప్పుడు తన అకౌంట్ కు పంపించి వాటి ద్వారా బిల్లులు కట్టానని రమ్య క్లారిటీ ఇచ్చింది. తన స్థానంలో ఇంతకు ముందు పని చేసిన వారిలా తాను కూడా పని చేశానని ఆమె తెలిపింది.తాను ఎవరినీ మోసం చేయలేదని రమ్య. తాను ఇంతకాలమూ ఎంతో సైలెంట్ గా ఉన్నానని, ఇప్పుడు తనపైనే ఆరోపణలు వచ్చాయి కాబట్టి, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని తెలిపింది. తాను నోరు విప్పితే విశాల్ విషయం అందరికీ తెలుస్తుందని.. మహిళను కావడం వల్లే నన్ను బెదిరిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది.

పైకి హీరోలా కనిపించే విశాల్, వాస్తవానికి పెద్ద విలన్ అని, అందుకు సంబంధించిన ఎన్నో ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. తన దగ్గర ఉన్న వివరాలన్నీ చెబితే, విశాల్ నిజస్వరూపం బయట పడుతుందని హెచ్చరించింది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఆఫీసులో ఎన్నో పంచాయతీలు జరగడాన్ని తాను చూశానని.. విశాల్ కు ఎదురుగా ఎవరైనా నిలిస్తే హరి వాళ్ళను ఆఫీసుకు తీసుకుని వచ్చి చిత్రహింసలు గురిచేయడాన్ని తాను చూశానని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. విశాల్ ఒక పెద్ద విలన్ అని.. అతడు చేయబోయే మోసంలో నన్ను బలిపశువుగా చేయాలని భావిస్తూ ఉన్నాడని ఆమె తెలిపింది.

Next Story