విశాఖ: వరహానదిలో బోల్తా పడ్డ బస్సు
By సుభాష్ Published on 10 Sep 2020 2:36 AM GMTవిశాఖలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ రాయవరం మండలం పెనుగొండ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. వరహానది ఒడ్డున బ్రిడ్జిపై నుంచి ఓ ప్రైవేటు బస్సు దాదాపు 14 అడుగుల లోతులో పడిపోయింది. చెన్నై నుంచి విశాఖ వెళ్తున్న ఈ ప్రైవేటు బస్సు అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటన అర్ధరాత్రి జరిగింది. అయితే బస్సులో ఐదుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. వారికి తీవ్ర గాయాలైనట్లు అయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్పు పూర్తిగా ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు అక్కడి చేరుకుని పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బస్సులో ఐదుగురు ప్రయాణికులు మాత్రమే ఉండటం, ప్రాణ నష్టం జరగకపోవడం పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఘటన స్థలానికి ప్రోక్లెయినర్లను రప్పించి బస్సును వెలికి తీశారు.