ఆ ప్ర‌క‌ట‌న త‌ర్వాతే ప్ర‌ధాని మోదీ విశాఖలో అడుగుపెట్టాలి : వైఎస్ ష‌ర్మిల

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని వైఎస్ ష‌ర్మిల సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శించారు.

By Medi Samrat  Published on  4 Jan 2025 2:08 PM IST
ఆ ప్ర‌క‌ట‌న త‌ర్వాతే ప్ర‌ధాని మోదీ విశాఖలో అడుగుపెట్టాలి : వైఎస్ ష‌ర్మిల

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని వైఎస్ ష‌ర్మిల సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శించారు. కేంద్రం ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉందన్నారు. ఈనెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీని, రాష్ట్రంలోని కూటమి పార్టీలను APCC పక్షాన డిమాండ్ చేస్తున్నాం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తక్షణమే క్లారిటీ ఇవ్వాలి. SAILలో విలీనం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ కష్టాలను గట్టెక్కించేందుకు సుమారు రూ.20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. భవిష్యత్‌లో స్టీల్ ప్లాంట్‌కు ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా సొంత గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్‌కున్న 7 మిలియన్ టన్నుల సామర్ధ్యం మేరకు పూర్తి స్థాయిలో స్టీల్ ఉత్పత్తి చేయాలి.. 1400 రోజులుగా ఆందోళనలు చేస్తున్న కార్మికుల డిమాండ్లపై యాజమాన్యంతో స్పష్టత ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు అడుగుతున్నట్లు 3 ఏళ్ల పాటు స్టీల్ ప్లాంట్‌కి ట్యాక్స్ హాలీడే ఇవ్వాలని కోరారు. స్టీల్ ప్లాంట్ భవిష్యత్‌పై నిర్ణయం ప్రకటించాకే ప్ర‌ధాని మోదీ విశాఖలో అడుగుపెట్టాలన్నారు.

Next Story