ప్రియుడి కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మైనర్లు.. 'వాడు నా వాడు..కాదు నా వాడు అంటూ'

Two Minor Girls fight for Boyfriend in Visakhapatnam.ఓ అమ్మాయి కోసం ఇద్ద‌రు అబ్బాయిలు కొట్టుకోవ‌డం చూశాం. భ‌ర్త కోసం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Dec 2021 2:42 AM GMT
ప్రియుడి కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మైనర్లు.. వాడు నా వాడు..కాదు నా వాడు అంటూ

ఓ అమ్మాయి కోసం ఇద్ద‌రు అబ్బాయిలు కొట్టుకోవ‌డం చూశాం. భ‌ర్త కోసం ఇద్ద‌రు భార్య‌లు కొట్టుకోవ‌డం చూస్తూనే ఉన్నాం. అయితే.. ఓ అబ్బాయి కోసం ఇద్ద‌రు అమ్మాయిలు కొట్టుకున్నారు. అదీ కూడా అంద‌రూ చూస్తుండ‌గా..ఏకంగా న‌డిరోడ్డుపైనే. ఒక‌రి జ‌ట్టు మ‌రొక‌రు పట్టుకుని కొట్టుకున్నారు. 'వాడు నా వాడు.. కాదు నా వాడు' అంటూ బూతులు తిట్టుకుంటూ దెబ్బ‌లాడారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ ఇద్ద‌రు అమ్మాయిలు కూడా మైన‌ర్లు కావ‌డం గ‌మ‌నార్హం.

వివ‌రాల్లోకి వెళితే.. విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద కాలేజీ విద్యార్థులు బ‌స్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంత‌లో ఇద్ద‌రు అమ్మాయిలు ఒక‌రినొక‌రు అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించుకున్నారు. మాట‌లు ముదిరి ఏకంగా కొప్పులు ప‌ట్టుకున్నారు. జుట్టు జుట్టు పట్టుకుని, చెంపలు చెంపలు చెళ్లుమనిపించుకుంటూ.. పిడిగుద్దులు గుద్దుకున్నారు. అంద‌రూ చూస్తున్నారు..? క‌నీసం న‌డిరోడ్డుమీద ఉన్నామ‌నే సోయి కూడా లేకుండా అక్క‌డ వీరంగం సృష్టించారు. అమ్మాయిల ర‌చ్చ‌ను అక్క‌డే ఉన్న కొంద‌రు సెల్‌ఫోన్‌ల‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

ఇంతలో ప‌లువురు విద్యార్థులు ఆ అమ్మాయిల‌ను ఆపారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఇద్ద‌రు విద్యార్థినుల‌తో పాటు ప్రియుడిని స్టేష‌న్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. వారి త‌ల్లిదండ్రుల‌కు విష‌యం చెప్పి.. విద్యార్థుల‌ను చ‌దువుపై దృష్టి పెట్టాల‌ని సూచించారు. అనంత‌రం వారిని ఇంటికి పంపించి వేశారు. ఇద్ద‌రు మైన‌ర్లు అమ్మాయిలు.. ఓ అబ్బాయి కోసం కొట్టుకోవ‌డం తెలిసి.. ఇదేం విడ్డూరం.. స‌మాజం ఎటు పోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story