దేవర సినిమా పోస్టర్లపై 'సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్' నినాదాలు

సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ప్రకటించాలని కోరుతూ దేవర సినిమా పోస్టర్లపైన జన జాగరణ సమితి నాయకులు విశాఖపట్నం రామా టాకీస్ థియేటర్ వద్ద సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించి విజ్ఞప్తి చేశారు.

By Medi Samrat  Published on  26 Sep 2024 6:54 AM GMT
దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు

సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ప్రకటించాలని కోరుతూ దేవర సినిమా పోస్టర్లపైన జన జాగరణ సమితి నాయకులు విశాఖపట్నం రామా టాకీస్ థియేటర్ వద్ద సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించి విజ్ఞప్తి చేశారు.

కోట్లాదిమంది అభిమానులు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలుగోడి ఆత్మగౌరవం ఆపదలో ఉందని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు, నగర కన్వీనర్ సునీల్ కుమార్, దేవర శంకర్ పాల్గొన్నారు.

Next Story