16న సీఎం జగన్ రెండు జిల్లాల ప‌ర్య‌ట‌న

ఈ నెల 16న (సోమవారం) సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on  14 Oct 2023 3:29 PM IST
16న సీఎం జగన్ రెండు జిల్లాల ప‌ర్య‌ట‌న

ఈ నెల 16న (సోమవారం) సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌నకు సంబంధించిన‌ షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. 16వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుని మధురవాడ ఐటీ హిల్‌ నెంబర్‌ 2 వద్ద ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హెలీప్యాడ్‌ వద్ద జీవీఎంసీ బీచ్‌ క్లీనింగ్‌ మిషన్లు ప్రారంభిస్తారు, అక్కడినుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకుని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో యుజియా స్టెరైల్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడినుంచి అచ్యుతాపురం ఏపీసెజ్‌కు చేరుకుని లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌ 2 ఫార్ములేషన్‌ బ్లాక్‌ ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం సాయంత్రం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Next Story