త్వరలో వైజాగ్ రైల్వే జోన్‌కు ఆమోదం : జీవీఎల్

Nod for Vizag railway zone shortly. విశాఖపట్నం-సౌత్ కోస్ట్ రైల్వేకు ప్రత్యేక రైల్వే జోన్‌ను త్వరలో కేంద్రం ఆమోదించనుందని

By Medi Samrat
Published on : 18 Feb 2022 6:10 PM IST

త్వరలో వైజాగ్ రైల్వే జోన్‌కు ఆమోదం : జీవీఎల్

విశాఖపట్నం-సౌత్ కోస్ట్ రైల్వేకు ప్రత్యేక రైల్వే జోన్‌ను త్వరలో కేంద్రం ఆమోదించనుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. విభజన చట్టంలోని చాలా హామీలు ఇప్పటికే అమలయ్యాయని.. మిగిలిన హామీలు త్వరలోనే రూపుదిద్దుకుంటాయన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం కేంద్ర పథకాలకు స్టిక్కర్లను ఉపయోగిస్తోందని ఆరోపించిన ఆయన.. టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకుంటే బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భవనాలన్నింటినీ కేంద్రం ఉపాధి హామీ పథకంతో చేపట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు నమోదైన అభివృద్ధి కేంద్ర సహకారం, భాగస్వామ్యంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. అభివృద్ధిని సాధించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రుణాలను వినియోగించుకోవాలని ఎంపీ జివిఎల్ నరసింహారావు కోరారు.


Next Story