రోడ్డు ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Lorry hits bike in Madhurawada highway in Visakhapatnam.విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Dec 2021 4:00 AM GMT
రోడ్డు ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు. వివ‌రాల్లోకి వెళితే.. గురువారం తెల్ల‌వారుజామున మ‌ధుర‌వాడ‌లోని చంద్రంపాలెం జిల్లా ఉన్న‌త పాఠ‌శాల వ‌ద్ద ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో బైక్‌పై ప్ర‌యాణిస్తున్న దంప‌తుల‌తో పాటు వారి కుమారై అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

మృతుల‌ను దంప‌తులు ర‌మ‌ణ‌, ల‌క్ష్మీ వారి కుమారై శాంతిగా గుర్తించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలిపిల్లిలో బుధ‌వారం జ‌రిగిన ఓ శుభ‌కార్యానికి హాజ‌రైన వీరు తిరుగు ప్ర‌యాణంలో ఉండ‌గా.. ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.మృత‌దేహాల‌ను ప‌రిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story