మందుబాబుల‌కు షాక్‌.. విశాఖ‌లో మూడు రోజులు మ‌ద్యం దుకాణాలు బంద్‌

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా విశాఖ‌లో మూడు రోజుల పాటు మ‌ద్యం దుకాణాలు మూత ప‌డ‌నున్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2023 4:32 AM GMT
మందుబాబుల‌కు షాక్‌.. విశాఖ‌లో మూడు రోజులు మ‌ద్యం దుకాణాలు బంద్‌

మందుబాబుల‌కు షాకింగ్ న్యూస్ ఇది. మూడు రోజుల పాటు విశాఖప‌ట్నం జిల్లాలో మందు దొర‌క‌దు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మూడు రోజుల పాటు మ‌ద్యం దుకాణాలు మూత ప‌డ‌నున్నాయి.

ఉత్త‌రాంధ్ర జిల్లా ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌లు ఈ నెల 13న జ‌ర‌గ‌నున్న దృష్ట్యా క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు ఈ నెల 11 తేదీ సాయంత్రం 4 గంట‌ల నుంచి 13 వ తేదీ సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, టూరిజం బార్స్‌, నేవ‌ల్ క్యాంటీన్స్‌, క‌ల్లు దుకాణాలు, మ‌ద్యం డిపోలు కూడా మూసి వేయ‌డం జ‌రుగుతుంద‌ని జిల్లా ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ శాఖ సూప‌రింటెండెంట్ శ్రీనివాస్ ఓ ప్ర‌క‌న‌ట‌లో తెలిపారు.

Next Story