రాష్ట్రంలోని పలు ప్రాంతాలలోని వైసీపీ నాయకులు కూటమి పార్టీలలోకి వెళుతూ ఉన్న సంగతి తెలిసిందే. వైజాగ్ కార్పొరేషన్ ను సొంతం చేసుకోవాలని కూటమి నేతలు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో పలువురు కార్పొరేటర్లను కలిసిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. వారికి భరోసా కల్పించారు.
విశాఖపట్నంకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ నేతలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు కలిశారు. తాడేపల్లిలో ఆయన ఈ నేతలను కలిశారు. వైజాగ్ వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు నేడు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చారు. జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అధినేతకు శాలువాలు కప్పి సన్మానించారు. కొందరు మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ వైఖరిని వారికి వివరించారు. సామాన్యులను, పార్టీ కార్యకర్తలను కూడా భారీగా కలుస్తున్నారు వైఎస్ జగన్.