అరకు వింటర్ ఫెస్ట్ కు సిద్ధమా.?

ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో మూడు రోజుల పాటు అరకు వింటర్ ఫెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది

By Medi Samrat  Published on  1 Nov 2024 2:30 PM GMT
అరకు వింటర్ ఫెస్ట్ కు సిద్ధమా.?

ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో మూడు రోజుల పాటు అరకు వింటర్ ఫెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది. లోయలో తొలిసారిగా నిర్వహించనున్న ఈ ఉత్సవంలో దేశంలోని ఆదివాసీ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక బృందాలు, కళాకారులు పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఏఎస్‌ఆర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రికి తెలియజేశామని, ప్రారంభోత్సవానికి ఆయన రావడానికి తాత్కాలికంగా అంగీకరించారన్నారు. దీనికి `చలి పండుగ’ అని పేరు పెట్టి, వార్షిక ఈవెంట్ గా మార్చేందుకు ప్రయత్నిస్తామని కలెక్టర్ చెప్పారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక ఉత్సవాలతో పాటు, ఆదివాసీల ప్రాచీన కళలను ప్రదర్శించనున్నారు. పండుగ సందర్భంగా ప్రొఫెషనల్స్, పాఠశాల విద్యార్థులకు ఫోటోగ్రఫీ, డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లతో పాటు, హాట్ ఎయిర్ బెలూన్ ట్రిప్స్, హెలీ-టూరిజం వంటి సాహస క్రీడలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు ఏజెన్సీలతో మాట్లాడామని, లోయపై హెలికాప్టర్లను కూడా మోహరిస్తామని కలెక్టర్ చెప్పారు. చివరి రోజు సంగీత కచేరీతో ఉత్సవం ముగుస్తుందని తెలిపారు.

Next Story