శారదాపీఠం వద్ద మంత్రి అప్పల్రాజుకు అవమానం
AP minister Seediri Appalaraju Insulted by Police. విశాఖ శారదాపీఠం నిర్వహిస్తున్న వార్షికోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
By Medi Samrat Published on 9 Feb 2022 2:31 PM ISTవిశాఖ శారదాపీఠం నిర్వహిస్తున్న వార్షికోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. రాజశ్యామల యాగం కోసం ముఖ్యమంత్రితో పండితులు సంకల్పం చేయించారు. అమ్మవారికి వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జగన్ చేతుల మీదుగా కలశ స్థాపన చేయించారు. రాజశ్యామల యాగంలో జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ పాల్గొన్నారు. శారదాపీఠంలో జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు జగన్ ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేశారు.
ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజుకు అవమానం ఎదురైంది. ముఖ్యమంత్రి జగన్ విశాఖ శారదాపీఠానికి వస్తున్న సందర్భంగా శారదాపీఠంలోకి మంత్రి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఒక్కరే లోపలకు వెళ్లాలని, అనుచరులను లోపలకు పంపించబోమని ఒక సీఐ స్పష్టం చేశారు. మంత్రి మాట్లాడుతుండగా మీరు ఒక్కరే వెళ్తే వెళ్లండి లేకపోతే లేదు అంటూ ఆయన ముఖం మీదే గేటు వేశారు. షాక్ కు గురైన మంత్రి ఆ కార్యక్రమంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు.
మంత్రి మాత్రమే లోపలకి వెళ్లాలని అనుచరులు అనుమతించేది లేదని పోలీసులు చెప్పారు. మంత్రి చెప్పిన మాటలను అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. దీంతో దురుసుగా గెట్ వేసి లోపలకి వెళ్లాలని, లేకుంటే లేదని సీఐ తేల్చిచెప్పారు. తనకు క్షమాపణలు చెప్పాలని మంత్రి అప్పలరాజు, అనుచరులు డిమాండ్ చేశారనే వార్తలు వచ్చాయి. సీఐ క్షమాపణలు చెప్పక పోవడంతో మంత్రి అప్పలరాజు అలిగి వెనక్కి వెళ్లిపోయారని కథనాలు వచ్చాయి.