గంటా రాజీనామాకు ఆమోదం

విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు.

By Medi Samrat  Published on  23 Jan 2024 1:14 PM GMT
గంటా రాజీనామాకు ఆమోదం

విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. రెండేళ్ల కిందట స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా గంటా తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్ గంటా రాజీనామాను ఆమోదించారు. ఏపీలో త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో గంటా రాజీనామాను ఆమోదించడం వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగమేనని కూడా చెబుతున్నారు. ఏపీలో కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ), సీఎం రమేశ్ (బీజేపీ), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వైసీపీ) పదవీకాలం పూర్తికావొస్తోంది. వీరిస్థానాల్లో ముగ్గురు కొత్తవారిని రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది. సరిగ్గా రాజ్యసభ ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావు ఆయన ఓటు హక్కు కోల్పోతారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనను వ్యతిరేకిస్తూ 2022 ఫిబ్రవరిలో గంటా శ్రీనివాస్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను స్పీకర్‌కు అందించారు. ఇన్నాళ్లు రాజీనామాను పెండింగ్‌లో పెట్టిన స్పీకర్ తీరా ఎన్నికల ముంగిట రాజీనామాకు ఆమోదం తెలిపారు.

Next Story