విశాఖ సాయిప్రియ కేసు.. కొత్త ట్విస్ట్ మామూలుగా లేదుగా.. ఏకంగా తండ్రిపైనే..

A case has been registered against the father in the Visakha Saipriya case. గత నెల 25న భర్తను విడిచి వెళ్లిన సాయిప్రియ కేసులో సాయిప్రియ తండ్రి రాపిరెడ్డి అప్పలరాజుపై విశాఖపట్నం

By అంజి  Published on  30 Aug 2022 2:06 PM IST
విశాఖ సాయిప్రియ కేసు.. కొత్త ట్విస్ట్ మామూలుగా లేదుగా.. ఏకంగా తండ్రిపైనే..

గత నెల 25న భర్తను విడిచి వెళ్లిన సాయిప్రియ కేసులో సాయిప్రియ తండ్రి రాపిరెడ్డి అప్పలరాజుపై విశాఖపట్నం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 25న సాయిప్రియ తన భర్త శ్రీనివాస్‌తో కలిసి వెకేషన్‌కు ఆర్కే బీచ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజు తన భర్త రిలాక్స్‌గా ఉన్న సమయంలో సాయిప్రియ ముందుగా ప్లాన్ చేసుకుని ప్రియుడు రవితేజతో కలిసి పారిపోయింది. ఆ తర్వాత తన కూతురు బీచ్‌లో కనిపించకుండా పోయిందని సాయిప్రియ తండ్రి రాపిరెడ్డి అప్పలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన జిల్లా అధికారులు, పోలీసులు బీచ్‌లో పెద్ద ఎత్తున గాలింపు నిర్వహించారు.ఆమె కొట్టుకుపోయి ఉంటుందని భావించి, పోలీసులు, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ కలిసి భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ చేశాయి. ఇందుకోసం భారీగా ప్రభుత్వ వనరులను వినియోగించారు. ఆ తర్వాత సాయి ప్రియ తన ప్రియుడు రవితేజతో కలిసి పారిపోయిందని పోలీసులకు తెలిసింది. కొన్నాళ్లుగా అతడితో ప్రేమాయణం సాగిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ బెంగళూరు వెళ్లి అక్కడ పెళ్లి చేసుకున్నారు.

ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైజాగ్ నగర పోలీసులను ఐసీజీ అభ్యర్థించింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన పోలీసులు.. సాయిప్రియ తండ్రికి తన కూతురు రవితేజ అనే యువకుడిని ప్రేమిస్తోందని గతంలోనే తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులను, జిల్లా అధికార యంత్రాంగాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రామారావు వెల్లడించారు.

Next Story