బీచ్ ముందు నిలుచున్న అనుష్క.. కోహ్లీ కామెంట్ చూసారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sep 2020 4:17 PM GMT
బీచ్ ముందు నిలుచున్న అనుష్క.. కోహ్లీ కామెంట్ చూసారా..?

క్రికెటర్లు-బాలీవుడ్ హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం మన దేశంలో కామనే..! అలా ట్రెండ్ ను కంటిన్యూ చేసిన వారిలో అనుష్క శర్మ-విరాట్ కోహ్లీలు ఉన్నారు. ఇటీవలే అనుష్క కడుపుతో ఉన్నట్లు ప్రకటించింది. పలువురు ప్రముఖులు వీరికి విషెష్ తెలిపారు.

తాజాగా ఇంస్టాగ్రామ్ లో అనుష్క శర్మ మరో ఫోటోను పోస్టు చేసింది. బీచ్ లో అనుష్క నిలబడి ఉండగా.. తన కడుపును చూసుకుంటూ ఉంది. 'బేబీ బంప్' ను చూసుకుంటూ ఉన్న అనుష్క శర్మ ఫోటో కింద విరాట్ కోహ్లీ పెట్టిన కామెంట్ అందరినీ ఆకర్షిస్తోంది. "My whole world in one frame" అంటూ కామెంట్ చేశాడు విరాట్.

V1

తన భార్య.. వారికి పుట్టబోయే బిడ్డ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఉండడంతో విరాట్ కోహ్లీ ఎంతో ఆనందంతో ఈ కామెంటును చేశాడు. ఈ కామెంట్ కు లైకుల వర్షం కురుస్తోంది.

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ తాము ముగ్గురం కాబోతున్నామంటూ గత నెలలో ప్రకటించారు. వారిద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటోలో అనుష్క శర్మ బేబీ బంప్ తో ఉండడాన్ని అందరూ గమనించవచ్చు. 2021 జనవరికి బిడ్డ వస్తాడని హింట్ ఇచ్చారు.

అనుష్క శర్మ పలు బాలీవుడ్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. విరాట్ ను 2017లో పెళ్లి చేసుకుంది. ఇటలీలో వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం అనుష్క శర్మ నటించడం లేదు కానీ.. నిర్మాతగా వ్యవహరిస్తోంది. అనుష్క శర్మ ఆఖరిగా 2018లో షారుఖ్ ఖాన్ సరసన జీరో సినిమాలో నటించింది.

Next Story