పోలీసుల అదుపులో విరసం సభ్యుడు జ‌గ‌న్

By Medi Samrat  Published on  11 Oct 2019 11:29 AM GMT
పోలీసుల అదుపులో విరసం సభ్యుడు జ‌గ‌న్

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుడు, విరసం సభ్యుడు జగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఎస్‌ఐబీ పోలీసులు ఇవాళ ఉదయం విరసం సభ్యుడు జగన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

తార్నాకలోని జగన్‌ నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. జగన్‌ ఇంటికి చేరుకున్న పౌరహక్కుల సంఘం నేతలు.. జగన్‌ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. అనుమానాలతో అరెస్ట్‌లు చేసి చిత్ర హింసలకు గురిచేస్తున్నారని విరసం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ భార్య మాట్లాడుతూ.. పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తమకు సమాచారం కూడా ఇవ్వలేదని.. మూడు గంటల పాటు ఇంట్లో సోదాలు చేసిన విషయం ఇంటి పక్కన వాళ్ళు చెపితే తెలిసిందని అన్నారు. ఇంట్లో ఏమి దొర్కకపోయినా ల్యాప్‌ట్యాప్‌ను జగన్ సోదరుడి ద్వారా తెప్పించుకుని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారని జగన్‌ భార్య తెలిపింది. తన భర్తకు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని విరసం నేత జగన్‌ భార్య డిమాండ్ చేశారు.

Next Story