రెప్ప‌పాటులో.. కాల‌నాగు కాటు నుంచి కొడుకును కాపాడుకుంది..!

Woman saves son from giant cobra in scary viral video from Karnataka. కర్ణాటక రాష్ట్రం మాండ్యలో పాము నుండి తల్లి తన కొడుకును కాపాడుకుంది.

By Medi Samrat
Published on : 13 Aug 2022 6:42 PM IST

రెప్ప‌పాటులో.. కాల‌నాగు కాటు నుంచి కొడుకును కాపాడుకుంది..!

కర్ణాటక రాష్ట్రం మాండ్యలో పాము నుండి తల్లి తన కొడుకును కాపాడుకుంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ తల్లి సమయస్ఫూర్తితో స్పందించి పాము కాటు నుంచి బిడ్డను రక్షించుకుంది. ఆ తల్లీబిడ్డలు ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి బయట మెట్ల కింద నుంచి పాము వెళ్తోంది.

ఆ సమయంలో పామును గమనించకుండా ఆ చిన్నారి కిందకు కాలు వేయబోయాడు. అలా పాము ముందు అతడు వెళ్ళిపోయాడు. వెంటనే పాము తల ఎత్తి కాటు వేయబోయింది. అక్కడే ఉన్న తల్లి పామును గమనించి పిల్లాడిని పక్కకు లాగేసింది. పాము కూడా పిల్లాడిని ఏమి చేయకుండా తనంతట తాను వెళ్ళిపోయింది. తమ ఇంటి చుట్టూ తిరుగుతున్న ఒక పెద్ద నాగుపాము నుండి తల్లి తన కొడుకును రక్షించింది. మొత్తం దృశ్యం సిసిటివిలో రికార్డు అయింది. వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. నెటిజన్లు తల్లిపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.


Next Story