తిరువనంతపురంలోని పలోడ్ పెరింగల రోడ్డుపై ఒక మహిళ స్కూటర్‌ను అడవి పందుల గుంపు ఢీకొనడంతో ఆమె ఒక్కసారిగా కిందకు పడిపోయింది. బాధితురాలు పెరింగమ్మల ప్రాంతానికి చెందిన నిసా ఇంటికి వెళుతుండగా మధ్యాహ్నం సమయంలో ఈ సంఘటన జరిగింది.
బైక్ పై వెళుతూ ఉండగా ఒక్కసారిగా అడవి పంది వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆమె కిందకు పడిపోయింది. స్థానికులు ఆమెను కాపాడడానికి ముందుకు వచ్చారు. ఆమెను చికిత్స కోసం మెడికల్ కాలేజీలో చేర్చారు. రాత్రిపూట అడవి పందుల దాడులు సర్వసాధారణం అయినప్పటికీ, పగటిపూట ఇటువంటి సంఘటనలు చాలా అరుదు అని స్థానికులు తెలిపారు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.