డ్యాన్స్ చేస్తూ మహిళ మృతి.. వీడియో వైరల్
Woman dies while dancing in Madhya Pradesh.అప్పటి వరకు అందరితో ఎంతో సరదాగా ఉంటారు.
By తోట వంశీ కుమార్
అప్పటి వరకు అందరితో ఎంతో సరదాగా ఉంటారు. హుషారుగా కనిపిస్తారు. అయితే ఉన్నట్లుండి గుండెపోటుతో నేలపై కుప్పకూలి మరణిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఓ పెళ్లి వేడుక దగ్గర పడుతుండడంతో డ్యాన్స్ కచేరిని ప్రారంభించారు. వివాహానికి వచ్చిన వారిలో కొందరు మహిళలు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఓ మహిళ డ్యాన్స్ చేస్తూ గుండెపోటుకు గురై మృతి చెందింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
సియోని జిల్లా బఖారీ గ్రామంలో బుధవారం రాత్రి ఓ వివాహా వేడుకలో కచేరి జరిగింది. ఈ సమయంలో కొందరు మహిళలు నృత్యం చేస్తున్నారు. ఇంతలో 60 ఏళ్ల వృద్ధురాలు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా ఫ్లోర్‌పై పడిపోయింది. పక్కన ఉన్న వారు వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో మహిళ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Woman dies of heart atatck while dancing in Seoni district of Madhya Pradesh. pic.twitter.com/gO6D0o1gNg
— Nakshab (@your_nakshab) December 15, 2022
ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఇలాంటి ఘటననే గత ఆదివారం చోటు చేసుకుంది. పెళ్లి కూతురి తండ్రి ఆనందంతో డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ ఫ్లోర్‌పై పడి మరణించాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో వధువు మామ కన్యాదానం చేశారు.