Video : కారు డ్రైవ్ చేస్తూ లాప్‌టాప్‌ ముందేసుకున్న మహిళ.. బెంగళూరు పోలీసులు వదులుతారా.?

బెంగళూరు అంటే ట్రాఫిక్‌.. ట్రాఫిక్ అంటే బెంగళూరు అనే వాదనను సోషల్ మీడియాలో ఎప్పుడూ చూస్తుంటాం.

By Medi Samrat  Published on  13 Feb 2025 2:15 PM IST
Video : కారు డ్రైవ్ చేస్తూ లాప్‌టాప్‌ ముందేసుకున్న మహిళ.. బెంగళూరు పోలీసులు వదులుతారా.?

బెంగళూరు అంటే ట్రాఫిక్‌.. ట్రాఫిక్ అంటే బెంగళూరు అనే వాదనను సోషల్ మీడియాలో ఎప్పుడూ చూస్తుంటాం. ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన ప్రజలు ఆన్‌లైన్ సమావేశాలకు బస్సుల్లోనో, క్యాబుల్లోనో హాజరవడం మనం చూశాం. ఇప్పుడు ఓ బెంగళూరు మహిళ నగరంలో ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేస్తూ ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ కెమెరాకు చిక్కింది. ఈ సంఘటన గురించి బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులు కూడా స్పందించారు. ఇటువంటి ప్రమాదకర పనులకు పాల్పడవద్దని గట్టి హెచ్చరికను జారీ చేసింది.

X లో, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) ట్రాఫిక్ నార్త్, బెంగళూరు, డ్రైవింగ్ చేస్తున్న మహిళ తన ల్యాప్‌టాప్‌ను స్టీరింగ్ వీల్‌పై బ్యాలెన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు మహిళకు జరిమానా విధిస్తున్నట్లు చూపుతున్న చిత్రాన్ని కూడా పోలీసులు పంచుకున్నారు.

Next Story