Viral video : గర్భగుడిలో కేక్ కట్ చేసి.. మొదటి ముక్కను దేవుడికి సమర్పించింది
వారణాసి ఆలయంలో ఓ మహిళ తన పుట్టినరోజు నాడు కేక్‌ను కట్ చేయడంపై భక్తులు తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 2 Dec 2024 7:15 PM ISTవారణాసి ఆలయంలో ఓ మహిళ తన పుట్టినరోజు నాడు కేక్‌ను కట్ చేయడంపై భక్తులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న మమతా రాయ్ తన పుట్టినరోజు నాడు వారణాసి కాలభైరవ ఆలయంలో కేక్ కట్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేసిన రీల్ లో మమతా రాయ్ ఆలయంలోకి ప్రవేశించి, గర్భగుడిలో కేక్ కట్ చేసింది. అంతేకాకుండా ఆమె మొదటి కేక్ ముక్కను దేవుడికి సమర్పించింది. మమతా రాయ్‌కి సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉందని ఆలయ అధికారులకు తెలియదన్నారు. ఆమె వీడియో తీసిన విషయం ఆలయ నిర్వాహకులకు తెలియదట. ఈ ఘటన పట్ల వచ్చిన విమర్శల కారణంగా ఆలయ అధికారులు ఇకపై ఆలయం లోపల కేక్‌లు కట్ చేయడం, వాటిని నైవేద్యంగా పెట్టడాన్ని నిషేధిస్తూ ప్రకటన జారీ చేశారు.
ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మమతా రాయ్ కు లీగల్ నోటీసు పంపనున్నట్లు ప్రకటించింది. కేక్ కటింగ్ అనేది సాంప్రదాయ వైదిక పద్ధతులలో భాగం కాదని, పుట్టినరోజున దేవుడి నుండి ఆశీర్వాదం తీసుకోవాలి తప్ప కొవ్వొత్తులు ఊదడం, కేక్ కట్ చేయడం సరైంది కాదని కాశీ విద్వత్ పరిషత్ తెలిపింది. ఇలాంటి పద్ధతులను ఆలయ ప్రాంగణాల్లో ఆపివేయాలని తాము ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని సంప్రదిస్తామన్నారు హిందూ సంఘాల సభ్యులు.
चंद पैसों के लिए पंडा-पुजारियों ने हमारे आस्था के केंद्रों को मजाक बना रखा है, आप भी जेब ढीली करिये और गर्भगृह में बर्थडे व एनिवर्सरी सेलिब्रेट कर सकते हैं, काल भैरव मन्दिर में केक काटने का है ये वीडियो #varanasi pic.twitter.com/joznhamSrF
— Dr Raghawendra Mishra (@RaghwendraMedia) November 29, 2024