సోషల్ మీడియాలో ఏదోరకంగా వైరల్ కావాలి.. రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలి.. ఈ పిచ్చితో కొందరు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఫేమస్ కావడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో, రంజీత్ చౌరాసియా అనే యువకుడు రీల్ షూట్ చేయడానికి రైల్వే ట్రాక్‌పై పడుకుని తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఆ తర్వాత అతని పైనుండి రైలు వెళ్లింది. అతను షారుఖ్ ఖాన్ చిత్రం బాద్షా నుండి ఒక పాటను ఆ వీడియోకు జోడించి, దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
ఈ వీడియోతో ఫేమస్ కావాలనుకున్న రంజిత్‌కు రైల్వే పోలీసులు షాకిచ్చారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఈ సంఘటన రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. రైల్వే ట్రాక్‌ను అడ్డుకున్నందుకు ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) అతన్ని గుర్తించి అరెస్టు చేశారు. రైల్వే కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ఎవరైనా కఠినమైన పరిణామాలను ఎదుర్కొంటారని GRP ఇన్‌స్పెక్టర్ అరవింద్ పాండే హెచ్చరించారు.