టోల్ ప్లాజా దగ్గర కొట్టుకున్న ఇద్దరు మహిళలు

Two Women Thrash Each Other During Fight At Nashik Toll Plaza. నాసిక్‌లోని పింపాల్‌గావ్ టోల్ ప్లాజా వద్ద ఇద్దరు మహిళలు తీవ్ర ఘర్షణకు దిగారు.

By Medi Samrat  Published on  16 Sept 2022 6:33 PM IST
టోల్ ప్లాజా దగ్గర కొట్టుకున్న ఇద్దరు మహిళలు

నాసిక్‌లోని పింపాల్‌గావ్ టోల్ ప్లాజా వద్ద ఇద్దరు మహిళలు తీవ్ర ఘర్షణకు దిగారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిలో ఒకరు టోల్ ప్లాజా ఉద్యోగి కాగా, మరొకరు టోల్ ప్లాజా నుండి వెళుతున్న మహిళ అని చెబుతున్నారు. వైరల్ క్లిప్‌లో, గొడవను ఆపడానికి కొందరు స్థానికులు జోక్యం చేసుకున్నారు. ఇద్దరూ ఒకరి జుట్టును మరొకరు లాగడం, ఒకరినొకరు చాలాసార్లు కొట్టుకోవడం కనిపించింది. నాసిక్ సమీపంలోని పింపాల్‌గావ్ టోల్ బూత్‌లో మహిళల మధ్య ఈ ఘటన చోటుచేసుకుందని ట్విట్టర్ లో వీడియోను పోస్ట్‌ చేశారు.

చీర కట్టుకున్న ఇద్దరు మహిళలు ఒకరినొకరు పదే పదే కొట్టుకోవడం, దుర్భాషలాడుకోవడం, చెప్పుతో కొట్టుకోవడం వంటివి వీడియోలో చూడొచ్చు. వారిలో ఒకరు మరాఠీలో మాట్లాడడం, బెదిరించడం కూడా వినబడింది. వీడియో చివర్లో స్థానికులు జోక్యం చేసుకుని మహిళలను దూరం చేయడం కనిపిస్తుంది. టోల్‌ రుసుముపై గొడవ కారణంగా బుధవారం ఈ ఘటన జరిగింది.


Next Story