ఆకాశంలో వింత ఆకారం - ఎగ‌బ‌డి చూస్తున్న‌ హైద‌రాబాద్ వాసులు

Strange white colour object in sky in Hyderabad.ఈ ఉద‌యం ఆకాశంలోని మేఘాల మ‌ధ్య‌న ఏదో వింత ఆకారం క‌నిపిస్తుందంటూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Dec 2022 9:36 AM IST
ఆకాశంలో వింత ఆకారం - ఎగ‌బ‌డి చూస్తున్న‌ హైద‌రాబాద్ వాసులు

ఈ ఉద‌యం ఆకాశంలోని మేఘాల మ‌ధ్య‌న ఏదో వింత ఆకారం క‌నిపిస్తుందంటూ ఓ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు ఈ వీడియోలో క‌నిపించేది ఏమిటో తెలుసుకునేందు తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. కొంద‌రు త్రిభుజాకారంలో ఉంద‌ని అంటుండ‌గా, మ‌రికొంద‌రు డైమండ్ షేపులో ఉంద‌ని అంటున్నారు, కొంద‌రు దీన్ని గ్ర‌హ‌శ‌క‌లం అని, ఇంకొంద‌రు ఏదైన శాటిలైట్ కావొచ్చున‌ని ఎవ‌రికి తోచిన‌ట్లు వారు కామెంట్లు పెడుతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ కూడా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. అస‌లు ఇది ఏమిటో తెలుసుకునేందుకు న్యూస్ మీట‌ర్ బృందం ప్ర‌య‌త్నించింది. చివ‌రకు అది వెద‌ర్ రీసెర్చ్ హీలియం బెలూన్ అని తెలిసింది.

దీనిపై డైరెక్ట‌ర్ ఆఫ్ ప్లాన‌ట‌రీ రీసెర్చ్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా రఘునందన్ మాట్లాడుతూ.. వాతావ‌ర‌ణంలోని మార్పులు తెలుసుకునేందుకు ఇలాంటి బెలూన్ల‌ను పంప‌డం జ‌రుగుతుంది. హైద‌రాబాద్‌లో ఉన్న నేష‌న‌ల్ బెలూన్ ఫెసిలిటీ అనే రీసెర్చీ సంస్థ ప‌రీశోధ‌న కోసం ఈ బెలూన్ పంపించింది. ఇది హీలియం బెలూన్‌. వెయ్యి కిలోల బరువు ఉన్న ప‌రిక‌రాల‌ను శాస్త్ర‌వేత్త‌లు దీనిలో అమ‌ర్చి పంపించారు. 40 కిలోమీట‌ర్ల ఎత్తుకు చేరుకున్న త‌రువాత ఈ బెలూన్ ర‌క‌ర‌కాల ప‌రిశోధ‌న‌లు చేసిన త‌రువాత కింద‌కు వ‌స్తుంది. ప‌రిశోధ‌న‌ల కోసం ఈ బెలూన్‌ను పంపుతున్న‌ట్లు గ‌త నెల‌లోనే నేష‌న‌ల్ బెలూన్ ఫెసిలిటీ అనే రీసెర్చీ సంస్థ తెలియ‌జేసింది అని చెప్పారు.

Next Story