యువతి చెవిలో పాము.. ఒళ్ళు జలదరింపు ఖాయం..!

Snake Gets Trapped in Woman's Ear Hole. చెవులలోకి పురుగులు, ఈగలు, సాలీళ్లు వంటివి వెళుతూ ఉండడాన్ని మనం చూశాం.

By Medi Samrat  Published on  7 Sep 2022 12:11 PM GMT
యువతి చెవిలో పాము.. ఒళ్ళు జలదరింపు ఖాయం..!

చెవులలోకి పురుగులు, ఈగలు, సాలీళ్లు వంటివి వెళుతూ ఉండడాన్ని మనం చూశాం. వాటిని వైద్యులు బయటకు తీసే వీడియోలను మనం చూస్తూ వస్తున్నాం. అయితే చెవుల్లోకి ఏకంగా పాము వెళ్లి ఉండడాన్ని చూసి ఎవరైనా షాక్ అవ్వక తప్పదు. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

సోషల్ మీడియాలో ఏం చూస్తామో ఊహించలేము. వీటిలో కొన్ని వీడియోలు హృదయాన్ని ఆహ్లాదపరుస్తాయి, కొన్ని భయంకరంగా ఉంటాయి. ఇంకొన్ని ఒళ్ళు జలదరించేలా చేస్తాయి. ఇటీవల, ఇలాంటి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉంది. ఒక అమ్మాయి చెవిలో ఉన్న పాము నోటిని తెరచి ఉండడం కనిపిస్తుంది. వీడియోలో నొప్పితో బాధపడుతున్న ఈ అమ్మాయి గొంతు వింటే భయంతో ఉలిక్కిపడిపోవడం ఖాయం.

ఓ మహిళ చెవి రంధ్రంలో పాము ఇరుక్కుపోయిన ఘటన చోటుచేసుకుంది. అదే వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. ఒక వైద్యుడు మెడికల్ టాంగ్స్ సహాయంతో పామును రంధ్రం నుండి బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తుంది. పాము తల చెవి రంధ్రం నుండి బయటకు పొడుచుకు వచ్చింది. పాము శరీరం చెవిలో ఇరుక్కుపోయింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఎక్కడి నుండి వచ్చిందనే విషయాన్ని న్యూస్ మీటర్ స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది.Next Story