Video : గ్రిల్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడి త‌ల‌.. అల ఎలా జ‌రిగింది.?

నల్గొండలోని యాదగిరిగుట్ట ఆలయంలో ఆదివారం ఆరేళ్ల బాలుడి త‌ల‌ ప్రమాదవశాత్తూ గ్రిల్‌లో ఇరుక్కుపోయింది.

By Medi Samrat  Published on  29 Dec 2024 1:30 PM IST
Video : గ్రిల్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడి త‌ల‌.. అల ఎలా జ‌రిగింది.?

నల్గొండలోని యాదగిరిగుట్ట ఆలయంలో ఆదివారం ఆరేళ్ల బాలుడి త‌ల‌ ప్రమాదవశాత్తూ గ్రిల్‌లో ఇరుక్కుపోయింది. ఎంట్రీ టిక్కెట్టు తీసుకునేందుకు బాలుడు క్యూలో వేచి ఉండగా ఈ ఘటన జరిగింది. అయితే.. బాలుడి తల్లిదండ్రులు, కొంతమంది భక్తులు ఓర్పుతో వ్య‌వ‌హ‌రించి బాలుడిని పెద్ద ప్రమాదం నుండి రక్షించారు. నరసింహస్వామి దేవస్థానం దర్శనానికి వచ్చి ప్ర‌మాదం బారిన ప‌డ్డ ఆ బాలుడిని దయాకర్‌గా గుర్తించారు. తల్లిదండ్రులు, భక్తులు బాలుడికి సహాయం చేస్తున్న ఆ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో.. బాలుడిని అతని తండ్రి వెనుక నుండి పట్టుకోగా.. భక్తులలో ఒకరు గ్రిల్ నుండి బయటకు నెట్టడం చూడ‌వ‌చ్చు. అయితే.. బాలుడి పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనపై స్పందించిన ఆలయ అధికారులు పిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు.


Next Story