Video : రోడ్డుపై ఇదేం రొచ్చు..? జంట‌పై నెట్టింట తీవ్ర ఆగ్రహం

పూణేలోని రద్దీగా ఉండే రోడ్డుపై ట్రాఫిక్ నిబంధ‌న‌లను ఉల్లంఘించిన జంట వీడియో వైరల్ అవుతూ ఉంది.

By Medi Samrat
Published on : 28 July 2025 7:09 PM IST

Video : రోడ్డుపై ఇదేం రొచ్చు..? జంట‌పై నెట్టింట తీవ్ర ఆగ్రహం

పూణేలోని రద్దీగా ఉండే రోడ్డుపై ట్రాఫిక్ నిబంధ‌న‌లను ఉల్లంఘించిన జంట వీడియో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు ఆన్‌లైన్‌లో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న క్లిప్‌లో, పూణేలో జంట బైక్ మీద వెళుతున్నారు. పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చున్న మహిళ ముందు నుండి రైడర్‌ను కౌగిలించుకుంది. వారిద్దరూ హెల్మెట్ ధరించలేదు. ఒక సమయంలో, పెట్రోల్ ట్యాంక్‌పై ఉన్న మహిళ వెనుకకు పడుకోవడానికి ప్రయత్నిస్తుంది. పాదాలను గాలిలో పైకి లేపుతూ ఉండగా.. బైక్ రద్దీగా ఉండే రోడ్డు గుండా కదులుతూనే ఉంది.

ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే నుండి ఇలాంటి వీడియో గతంలో వైరల్ అయింది. మరొక జంట బైక్‌పై హెల్మెట్ లేకుండా, ఎక్స్‌ప్రెస్‌వేలో వేగంగా వెళుతూ ఒకరినొకరు కౌగిలించుకుని కనిపించారు. నోయిడా ట్రాఫిక్ పోలీసులు బైక్ యజమానికి రూ. 53,500 ఈ-చలాన్ జారీ చేసింది.

Next Story